-పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల జనవరి 12న తిరుపతి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని పట్టణం నందు ఎజి అండ్ పి గ్యాస్ వారి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త పెందుర్తి వెంకటేశ్వర్ రావు, జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మరియు సంబంధిత అధికారులతో కలిసి సిఎం గారు పర్యటించే ప్రదేశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అంతకు మునుపు స్థానిక కలెక్టరేట్ మిని సమావేశ మందిరం నందు కలెక్టర్ గారు అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేస్తూ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఆర్డీవో తిరుపతి రామ్మోహన్, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి, జిల్లా సివిల్ సప్లై అధికారులు రాజు, ఎస్ ఈ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News