Breaking News

“కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను శుక్రవారం “ఏ.పీ.ఎస్.ఎస్.డి.సి[APSSDC] ఎన్టీఆర్ డిస్టిక్ ఆఫీస్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రమేష్ హాస్పిటల్స్ ఎదురుగా, ప్రభుత్వ ITI రోడ్, విజయవాడ, విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా” నందు “కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్[Company-Specific Drive]” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మరియు ఒకేషనల్ ఉపాధి కల్పన అధికారి వై. సత్యబ్రహ్మం  తెలియజేసారు.

జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC) మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అధ్వర్యంలో ఈ కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్[Company-Specific Drive] ను నిర్వహిస్తున్నామని మరియు ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలిపారు.

ఈ కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్[Company-Specific Drive]లో, Thesis ఎంటర్ప్రైజెస్ కంపెనీ కు ఇంటర్వ్యూలు నిర్వహించారని వారు తెలిపారు. మొత్తంగా 20 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 04 సెలెక్ట్ అయ్యారు అని తేలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *