గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా రెవిన్యూ అధికారి మరియు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ యన్.యస్.కె . ఖాజావలి , అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి నరసింహారావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశమును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడమైనది. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు డివిజనల్ స్థాయి కమిటీ సభ్యులైన రెవిన్యూ డివిజనల్ అధికారులు , సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, డీఎస్పీలు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు అదేవిధంగా మండల స్థాయి కమిటీ సభ్యులైన తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, SHO లు,మండల పశుసంవర్ధక శాఖాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.
1. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేల పేరిట కోళ్లను హింసించుట, ఇతర జంతువుల పట్ల
హింసగా ప్రవర్తించుట చట్ట రీత్యా నేరము.
2. కోడి పందెములనునిర్వహించుట ,జంతువుల పట్ల హింసగా ప్రవర్తించడం జంతు హింస నిరోధక చట్టం-1960
మరియు గేమింగ్ చట్టం-1974 ప్రకారం నేరము మరియు శిక్షార్హము.
3. కోడి పందేములను నిర్వహించే వ్యక్తులపై మండల మరియు డివిజనల్ స్థాయి కమిటీలు తగిన చర్యలు
తీసుకోవాలని తెలియజేయడమైనది.4. ప్రతి గ్రామంలో సచివాలయ స్థాయి ఉద్యోగులతో గ్రామ స్థాయి కమిటీ
లను ఏర్పాటు చేసి కోడి పందేలను నిర్వహించే వ్యక్తులను మరియు ప్రదేశాలను గుర్తించే విధంగా చర్యలు
తీసుకోవాలని తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులైన జిల్లా పరిషత్ సిఇఓ జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ , జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుక, జిల్లా రవాణా శాఖాధికారి సీతా రామిరెడ్డి , గుంటూరు ఆర్డిఓ శ్రీనివాసరావు , జిల్లాలోని అన్ని డివిజన్ల కమిటీ సభ్యులు , అన్ని మండలాల తహసీల్దార్లు , మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.