-సిఎం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల తనిఖీ (ఎ.ఎస్.ఎల్) లో భాగంగా ఎస్పీ తో కలిసి సమీక్షించి, సిఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు ఉండాలి : ఇంఛార్జి ఎస్పీ మణికంఠ చందోలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12న రేపు ఆదివారం తిరుచానూరు సమీపంలో ఎ.జి అండ్ పి సంస్థ వారు వినియోగదారులకు ఏర్పాటు చేసిన పి.ఎన్.జి గృహ గ్యాస్ కనెక్షన్లను ప్రారంభించే కార్యక్రమంలో మరియు తాజ్ హోటల్ నందు ఏర్పాటుచేసిన సిఎన్జి ఆటో మరియు ఎల్సివి వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, సహజవాయు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఏపీ నందు ప్రారంభించే కార్యక్రమంలో హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నందు సిఎం పర్యటన ఏర్పాట్లపై ASL లో( ముందస్తు భద్రత లైజన్) జిల్లా కలెక్టర్ ఇంఛార్జి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు రేపు ఆదివారం 12 న మద్యాహం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అనంతరం రోడ్డు మర్గాన బయలుదేరి తిరుచానూరు సమీపంలోని వినియోగదారుల గృహానికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పి.ఎన్.జి గృహ గ్యాస్ కనెక్షన్లను ప్రారంభించి,సదరు కుటుంబంతో మాట్లాడుతారని తెలిపారు. సాయంత్రం 4.25 గం.లకు తాజ్ హోటల్ చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన సిఎన్ జి ఆటో మరియు ఎల్సివి వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, సహజవాయు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఏపీ నందు ప్రారంభించే కార్యక్రమంలో హాజరు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 5.55 గం.లకు నారావారిపల్లికి బయలుదేరుతారని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ , ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు రవి మనోహరాచారి వెంకటరావు, శ్రీనివాసరావు, ఆర్డీఓ కిరణ్మయి, రామ్మోహన్, జిల్లా అధికారులు, విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.