Breaking News

డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (DPNG) సురక్షితం..

-ఎజి అండ్ పి గ్యాస్ వారి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 12న (నేడు) తిరుపతి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని పట్టణం నందు ఎజి అండ్ పి గ్యాస్ వారి కార్యక్రమంలో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

ఎజి అండ్ పి ప్రథమ్ – థింక్ గ్యాస్ వారు తిరుపతి జిల్లాలో డోమెస్టిక్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (DPNG) అనగా గృహావసరాలకు పైప్ లైన్ ఏర్పాటుతో వినియోగదారుల గృహాలకు సహజ గ్యాస్ ను అందించడం అని దానిని గృహాలకు, పరిశ్రమలకు కూడా వారు అందిస్తున్నారు అని అన్నారు. సదరు కంపెనీ వారి ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లాకు సిఎం విచ్చేయుచున్నారని తెలిపారు. జిల్లాలో ఏ. జి. ఎన్.పీ. ప్రథమ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ న్యాచురల్ గ్యాస్ ను గృహ వినియోగదారులకు, అదేవిధంగా ఇండస్ట్రియల్ యూనిట్స్ కి డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్నారు అని తెలిపారు. ఈ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వారు తిరుపతి జిల్లా తో పాటు రాయలసీమ లో మరొక మూడు జిల్లాలలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి 25 సంవత్సరాలు అనుమతులు ఇచ్చియున్నారని, అందులో భాగంగ డోమెస్టిక కన్జ్యూమర్స్ కి మరియు వాహనదారులకు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లయ్ చేయనున్నారు అన్నారు. ఈ నెల 12న (నేడు) జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మొదటిగా గృహ వినియోగదారులకు డి పి ఎన్జీ గృహ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహించి , తరువాత తాజ్ హోటల్ కి వెళ్ళి అక్కడ ఈ న్యాచురల్ గ్యాస్ తో నడిచే వాహనాలు 2,3, 4 వీలర్స్ ను సుమారు ఒక 65 నుండి 70 వరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంబోవత్సవం చేపట్టానున్నారనీ అన్నారు. అనంతరం తాజ్ లోపల ఎజి అండ్ పి వాళ్ళతో కలిసి ఇన్వెస్ట్ చేయబోతున్న కొంతమంది జపనీస్ ఇన్వెస్టర్స్ తో బోర్డ్ మీటింగ్ జరిపి అనంతరం తాజ్ హోటల్ లోపల ఎజి అండ్ పి ఆఫీసియల్స్ ,ఇతర పారిశ్రామిక వేత్తలు, డిస్ట్రిబ్యూషన్ కి సంబందించి న స్టేక్ హోల్డర్స్ తో ఒక సమావేశం కూడా నిర్వహిస్తారని తెలిపారు.

డోమెస్టిక్ పైప్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎల్.పీ.జి తో పూర్తి విభిన్నం అని అన్నారు. దీపం పథకంలో భాగంగా ఎల్. పీ. జి సిలిండర్ లు ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచితంగా ఇస్తుందని అన్నారు. కానీ ఈ డిపిఎన్జీ లో డైరెక్ట్ గా వంటగది లోని స్టవ్ కి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందుతుందని, ఎజి అండ్ పి వారు ఈ డిపిఎన్జీ డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ కెనెక్షన్ రేపు మన జిల్లాలో ప్రారంభిస్తున్నారు అని తెలిపారు. న్యాచురల్ గ్యాస్ అనేది పర్యావరణ హితం మరియు ఎల్. పీ. జి కంటే కూడా సురక్షితం అని అన్నారు. ఎల్. పీ. జి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) తో పోలిస్తే పైప్ కనెక్షన్ గ్యాస్ తక్కువ కి లభ్యమవుతుందని, ఎల్. పీ. జి కి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అదనంగా పడుతాయని, డి. పీ. ఎన్. జి కి అదనపు ఛార్జీలు ఏవి లేకుండా ఇంటికి డైరెక్ట్ గా పైప్ ద్వారా కనెక్షన్ ఇస్తారని అన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఇప్పుడు డైరెక్ట్ గా ఇది అందుబాటులో ఉందని అన్నారు. మన జిల్లాలో ఎజి అండ్ పి వారు డి. పీ. ఎన్. జి ని ప్రవేశ పెడుతుండటంతో వారి ఆహ్వానం మేరకు జనవరి 12న (నేడు) నేడు ముఖ్యమంత్రి మన జిల్లాకు రాబోతున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *