-పరిటాల లో ఎన్టీఆర్ జిల్లా స్థాయి పల్లె పండుగ కార్యక్రమం
-మినీ గోకులం షెడ్లు, సిసి రోడ్డు ప్రారంభోత్సవం
-ప్రారంచించిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి జిల్లాను ప్రగతి పథంలో వుంచేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి పల్లె పండుగ కార్యక్రమం లో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపి కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మసీద్ బజార్ లో నిర్మించిన సిసి రోడ్డు తోపాటు, రెండు మినీ గోకులం షెడ్లు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 23న అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించడం జరిగిందన్నారు. సంక్రాంతి ముందు రోజు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో పరిటాలలో రైల్వే స్టేషన్ రాబోతుందని అదేవిధంగా అతిపెద్ద లాజిస్టిక్ హబ్ కాబోతుందని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లుగాను, కొన్నిచోట్ల ఆరు లైన్లుగాను విస్తరించనున్నా మన్నారు. నందిగామ నియోజకవర్గంలో వేదాద్రి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు స్వయం ఉపాధి పథకాలలోనూ, స్వయం సహాయక గ్రూపులలోను చేరి చురుకుగా కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు. మహిళల కోసం త్వరలో 15 గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ అన్నారు…
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కావటం ఎన్టీఆర్ జిల్లా వాసుల అదృష్టమన్నారు., కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో మాట్లాడి నిధులు తీసుకురాగలడన్నారు. ఆయన సేవలను ఉపయోగించుకుని ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది చేస్తామన్నారు. ప్రజలందరీకి ఎంపి కేశినేని శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అరాచకాలు అక్రమ పాలన సాగింది అన్నారు. ప్రస్తుత తమ ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్నారు.
విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారం తో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు ప్రారంభించామని ఉచిత ఇసుక అందుబాటులో ఉంచామని అన్నారు.
రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ప్రజలు ఆశలను నెరవేరుస్తూ సుపరిపాలన అందిస్తామన్నారు. ఎంతోకాలంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ జిల్లాలో కేశినేని ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నందిగామ నియోజకవర్గంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి సహకారం అందించాలని దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రిలోని 50 పడకల నుండి 100 పడకలు ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు తంగరాల సౌమ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధి హామీలో అందరూ అనుకున్నట్టు మట్టి పనులు కాదని గట్టి పనులు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో సిసి రోడ్లు, అవసరమైన చోట్ల కాంపౌండ్ వాల్స్ తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. జిల్లాలో రెండు లక్షల జాబ్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారని అన్నారు. 80 లక్షల లేబర్ బడ్జెట్ మ్యాన్ డేస్ దాటి పనిచేశామన్నారు. తద్వారా 172 కోట్లు వేజెస్ జనరేట్ చేశామని అన్నారు. 136 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ చేశామని 200 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. పని దినాలు పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని ఆ దిశగా ఉపాధి హామీ పథక అధికారులు చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మాట్లాడుతూగ్రామాలు సుభిక్షంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ మీద ఆధారపడకుండా కేసినేని ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారన్నారు సిఎస్ఆర్ ట్రస్టు ద్వారా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శమైన పార్లమెంటు గా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జీవితాల్లో కోటి వెలుగులు తీసుకురావాలని భావితరాలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగను రెండు రోజులు ముందుగానే తీసుకొచ్చారన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో పల్లె పండుగ ద్వారా పల్లెల్లో పండుగ వాతావరణం రెండు రోజులు ముందుగానే తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల 30 వేల రూపాయలు విలువైన కాటిల్ షెడ్లు ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో 23 వేల రూపాయలు మాత్రమే చెల్లించి జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారన్నారు
మూడు నెలల కాలంలో అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు, పరిటాల గ్రామంలోని ఐదు రోడ్లు 20 లక్షల వ్యయంతో నిర్మించుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి సందు కూడా సిమెంటు రోడ్డలతో పూర్తి చేస్తామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన, శుద్ధిచేసిన త్రాగు నీటిని అన్ని గ్రామాలకు సరపరా చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కు జాతీయ ఉపాధి హామీ పథకంలో 4,500 కోట్లు మొదటి విడతగా మంజూరు చేయడం జరిగిందన్నారు.
సిమెంట్ రోడ్ల తో పాటు స్మశానాల నిర్మాణం, వాటికి కాంపౌండ్ వాల్స్, ప్రతి సందులోనూ వీధిలైటు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, చేస్తుందని నిధుల కొరతలేదని ఎక్కడా అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని , నిధులను నిర్లక్ష్యం చేసిందన్నారు . గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం దేశం బాగుంటుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.పి.వో లావణ్య, డి.ఎమ్.హెచ్.బో సుహాసిని, ఆర్.డి.వో బాలకృష్ణ, డి.ఎస్.పి తిలక్, బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త టి.సీతారామయ్య, జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, నీటి సంఘం చైర్మన్ కోట వీరబాబు, కంచికచర్ల మండలపార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, చందర్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షుడు కొండ్రుకుంట శ్రీను, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి, నందిగామ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏల్చూరి రాము, పరిటాల సర్పంచ్ యుద్దనపూడి ఆనందజ్యోత్స్న లతోపాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.