-కలెక్టర్ కార్యాలయంలో గుణదల చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం
-సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపి రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల మేరీమాత ఉత్సవాలు దేశంలో తమిళనాడు నాగపట్నంలో, విజయవాడ లో మాత్రమే జరుగుతాయని…ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతాము. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా చర్చ్ కౌన్సిల్ సభ్యులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య హాల్ నందు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , సిపి రాజశేఖర్ బాబులతోపాటు ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకున్నారు. పది లక్షల మంది పైగా భక్తులు వస్తారని కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో చర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్.విజయరాజు మాట్లాడుతూ కొండపైకి వచ్చే రహదారిలో ఆక్రమణలు ఎక్కువగా వున్నాయని వాటిని తొలగించాలని, అలాగే నిత్యం విజయవాడ బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి గుణదల చర్చికి మినీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా వున్నాయని వారిని ఆరికట్టడానికి ఆలయ ప్రాంగణంలో పోలీస్ అవుట్ పోస్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అడిగారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలకు సంబంధించి ఇలాంటి రివ్యూ మీటింగ్ చర్చ్ కౌన్సిల్ సభ్యులతో జరగటం ఇదే మొదటి సారి అన్నారు. ప్రభుత్వ పరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్నివిధాలు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రస్తుతానికి తాత్కలిక పనులు చేపట్టి…ఉత్సవాల అనంతరం పర్మినెంట్ పనుల దృష్టి సారిస్తామన్నారు.
కలెక్టర్ లక్ష్మి శా మాట్లాడుతూ మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుణదల చర్చి ప్రెసిడెంట్ నువ్వుల విజయబాబు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి జోసెప్ బాట్టిస్తా, కోశాధికారి గోలి విజయానంద్ జోసెప్ , సభ్యులు జి.రవి కుమార్, పిల్లి చిరస్తు దాసు, సేవ అబ్రహం, దాసరి సిల్వ ప్రసాద్, బండి జయరాజు, జి. బాల బాబుజీ, సి.అరుణ కుమారి, జి.యేసు దీవెనమ్మ లతోపాటు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ,టిడిపి దళిత నాయకులు నందిపాటి దేవానంద్, ఇత్తడి విక్టర్ చార్లెస్, ఊర్ల మోహనరావు,
చాట్ల రాజశేఖర్, పరిసపోగు రాజేష్, సంకె విశ్వనాధం పాల్గొన్నారు.