Breaking News

జిల్లాలో వరద పరిస్థితి పై అధికార్లను అపప్రమత్తం చేసాం : కలెక్టర్ జె. నివాస్ 

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అపప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు పట్టణంలో బయో గ్యాస్ ప్లాంట్, కంపోస్ట్ యార్డ్ లను మునిసిపల్ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వచ్చి చేరుతోందని , శుక్రవారం ఉదయం 50 వేల క్యూసెక్కు ల నీరు ప్రకాశం బ్యారేజ్ కి వచ్చిందని, పులిచింతల నుండి కూడా 50 వేల క్యూసెక్కు ల వరద నీరు వచ్చి చేరుకుందని, ఈ రాత్రికి మరింత వరద నీరు వచ్చే అవసకం ఉందన్నారు. . ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందకు వదులుతున్నామని, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు వరద ముంపునకు గురికాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, వరద అత్యవసర పరిస్థితిపై అధికారులను అపప్రమత్తం చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సకాలంలో అందించేందుకు గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసారని, ప్రజలకు సచివాలయాలు ద్వారా ఏ ఏ సేవలు, ఏ విధంగా అందుతున్నాయో పరిశీలిస్తున్నానన్నారు. అదే విధంగా ప్రతీ ఈ-క్రాప్ లో ప్రతీ రైతు తన భూమి, పంట వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే పధకాల లబ్ది, సేవలను పొందాలన్నారు. ఈ-క్రాప్ లో నమోదు సమయంలో భూమి, పంటల సాగు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకుని బయో మెట్రిక్ నమోదు ద్వారా చేయాలన్నారు. తిరువూరు పట్టణంలో బయో గ్యాస్ ప్లాంట్, కంపోస్ట్ యార్డ్ లను పరిశీలించడం జరిగిందని, 12 టన్నుల బయో గ్యాస్ ప్లాంట్ పూర్తి స్థాయి వినియోగం, కంపోస్ట్ నిర్వహణలోనికి వస్తే తిరువూరు పట్టణంలో చెత్త సమస్య తీరుతుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా అధికార్లను ఆదేశించడం జరిగిందన్నారు.

Check Also

బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరమని, ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే వ్యక్తుల పై కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరమని, ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *