తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ-క్రాప్ నమోదు తో ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ రైతు ఈ-క్రాప్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో శుక్రవారం పొలంబాట పట్టి వ్యవసాయ శాఖ సిబ్బంది చేస్తున్న ఈ-క్రాప్ నమోదును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సకాలంలో పంటల రుణాలు అందించడం , ఉచిత పంటల భీమా, వడ్డీ లేని రుణాలు, వంటి పథకాలతో పాటు ఇన్ ఫుట్ సబ్సిడీ, భూసార పరీక్షలు, పండిన పంటకు మార్కెటింగ్ సౌకర్యాలు, మద్దత్తు ధర కల్పించడం, సబ్సిడీ పై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించడం వంటి ఎన్నో సేవలను పొందవచ్చన్నారు. ఈ-క్రాప్ నమోదుపై రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ప్రతీ రైతు ఈ-క్రాప్ లో నమోదు అయ్యేలా వ్యవసాయ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సేవలను రైతులు భరోసా కేంద్రాల ద్వారా ప్రతీ రైతు ముంగిటకే తీసుకువెళ్లామన్నారు. రైతులకు పంట సాగు సమయంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అక్కడ వ్యవసాయ సిబ్బంది కి తెలియజేసినట్లైతే ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు.
ఈ సందర్భంగా కోకిలంపాడు లో రైతులు తమ గ్రామంలోని కల్వర్ట్ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్వయంగా పరిశీలించి కల్వర్ట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సెల్ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసారు.
అనంతరం కోకిలంపాడు లోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ సిబ్బంది పని చేయాలనీ చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ పరిధిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందలేదని మాట రాకుండా చూసే బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి సంక్షేమ పధకాలను వారికి వివరించి, అర్హులను గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వర్గం నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags tiruvuru
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …