Breaking News

2021 ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఫలితాలు వెల్లడి…

-రాష్ట్రంలో 5 లక్షల 19 వేల 797 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు…
-వెబ్ సైట్లో ఫలితాలను పరిశీలించుకోవచ్చు…
-హైపవర్ కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు…
-ఈ విద్యా సంవత్సరం నుండి ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నాం…
-ఇంటర్ పయిర్ పరీక్ష ఫీజ్ కట్టిన విద్యార్థులందరని సెంకండ్లెయిర్ కి ప్రమోట్ చేశాం….
-ఈ నెల 26 నుండి అధికారిక వెబ్ సైట్ “bie.ap.gov.in” ద్వారా మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 2021 ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాలను వారం రోజుల ముందుగానే విడుదల చేశామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ ఆర్ఎండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్‌తో కలసి మంత్రి సురేష్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీన జరగవలసిన ఇంటర్మీడియట్ పరీక్షలను కోవిడ్ కారణంగా వాయిదా వేశామని తిరిగి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాక సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలను రద్దు చేశామని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన వారందరని పాస్ చేశామని మంత్రి చెప్పారు. 2021 జూలై 31వ తేదీలోగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెల్లడించాలని కోర్టు తమ ఉత్తర్వులో పేర్కొన్నదని, వారం రోజుల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను ప్రకటించిందని మంత్రి అన్నారు.
పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం  చాయ రతన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమీటి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై ఇచ్చిన నివేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రకటించామని అన్నారు. 10 తరగతిలో 3 బెస్ట్ సబ్జెక్ట్ లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని 30 శాతం వేయిటేజ్ మార్కులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్ట్ లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని 70 శాతం వెయిటేజ్ మార్కులను ప్రామాణికంగా ఫలితాలను ప్రకటించామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 19 వేల 797 మంది ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులను పాస్ చేశామని మంత్రి అన్నారు. వారిలో రెగ్యూలర్ విద్యార్థులు 5 లక్షల 08 వేల 672 మంది కాగా ప్రైవేట్ గా పరీక్షలు రాసిన విద్యార్థులు 11 వేల 125 మంది ఉన్నారని మంత్రి అన్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను ఈ కింది తెలిపిన వెబ్ సైట్లో తెలుసుకోవచ్చునని మంత్రి అన్నారు.

పరీక్ష ఫలితాల కోరకు:
http://examresults.ap.nic.in http://results.bie.ap.gov.in http://results.apcfss.in http://bie.ap.gov.in

ప్రకటించిన పరీక్ష ఫలితాల పట్ల విద్యార్థులకు ఆసక్తి లేకపోతే అటువంటి విద్యార్థులకు మరో సారి బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి అన్నారు. అలాగే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 26 తేది సాయంత్రం 5 గంటల నుండి మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోన్నవచ్చునన్నారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ ఆధికారిక సైట్ “bie.ap.gov.in” నుండి విద్యార్థులు మార్కుల మెమో పొందవచ్చునని మంత్రి సురేష్ అన్నారు. ఐపి2 2021 పరీక్ష ఫలితాలు సంబంధించి ఫిర్యాదులు వుంటే తెలియజేయవచ్చునని దీనికి సంబంధించి ఇమెయిల్ ఐడి ourbieap@gmail.com వాట్సప్ నెంబరు 9391282578 ( మేసేజ్ కొరకు) తెలియజేయవచ్చునని మంత్రి అన్నారు.
ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిశంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్లు నిర్మాణం పూర్తికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లే అవుట్స్ ల్లో డిశంబర్ చివరి నాటికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *