Breaking News

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి సి ఎం చంద్రబాబు ను కలిసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక యూనిట్ గా జల జీవన్ మిషన్ పనులను చేపట్టాలని, అప్పుడే గ్రామ పంచాయతీల మీద భారం పడకుండా ఉంటుందని, నిర్వహణలో ఇబ్బందులు ఉండవని తెలిపారు. కృష్ణా డెల్టా రైతాంగానికి త్రాగు నీరు, సాగు నీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజి దిగువన పెనమలూరు లోని చోడవరం వద్ద ఒక బ్యారేజి, మోపిదేవి మండలంలోని బండి కోళ్ల లంక వద్ద ఒక బ్యారేజి నిర్మాణం, అలాగే ప్రకాశం బ్యారేజి ఎగువన అమరావతి మండలంలో వైకుంఠ పురం వద్ద మరొక బ్యారేజి నిర్మాణం నకు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు.

అదేవిధంగా కృష్ణా జిల్లాలో నాబార్డ్ కింద కొన్ని బ్రిడ్జి ల నిర్మాణం కొరకు, ఎదురు మొండి బ్రిడ్జి కొరకు అదనపు నిధులు, తరకటూరు బ్రిడ్జి నిర్మాణం, తాడేపల్లి పంపుహౌస్ వద్ద బ్రిడ్జి నిర్మాణం, కంకిపాడు లోని మంతెన వద్ద బుడమేరు మేజర్ డ్రైన్ పై వంతెన నిర్మాణం, పెదపారుపూడి పామర్రు మండలాలను కలుపుతూ యలమర్రు శివారు వద్ద పుల్లేరు డ్రైన్ పై వంతెననిర్మాణం, గూడూరు మండలం కంక టావ వద్ద వంతెన నిర్మాణం మొదలైన పనులను నాబార్డ్ గ్రాంట్ మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. పై పనుల విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *