Breaking News

అంబరాన్నిఅంటిన జిఎంసి సంక్రాంతి సంబరాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం గంగిరెద్దుల మరియి ఎద్దుల ప్రదర్శనలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, కర్రసాము, కోలాటం (మహిళలు, పురుషులు), స్టార్ మ్యూజికల్ నైట్, కాంతారా యాక్ట్, జగలర్స్ షో, బటర్ ఫ్లై, రోబో యాక్ట్ ప్రదర్శనలతో ఎన్టీఆర్ స్టేడియం గ్రామీణ వాతావరణ శోభతో అలరారింది. సంబరాల్లో ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు.
సంబరాల్లో చివరి రోజైన బుధవారం కనుమ పండుగరోజు గాలిపటాలు ఎగరేయడం, ప్రాసమణి ప్రోగ్రామ్, మ్యాజిక్ షో(ఇల్ యూజన్ షో), క్లాసికల్, ఫోక్ డ్యాన్స్(ఖలీల్), వాసవి ఆర్కెస్ట్రా వారి ప్రదర్శనలతో స్టేడియంకు హాజరైన ప్రజలు ఉత్సాహంతో తిలకించారు.
ఈ సందర్భంగా సంబరాలను హాజరైన నరసరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు మాట్లాడతూ నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరీ మూలాలు గ్రామాలతో ముడిపడి ఉంటాయని, రైతులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది వర్షాలు కురిసి పంటలు బాగా పండాయని, పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర అంది రైతుల ఇంట క్రాంతి ఈ సంక్రాంతి ఇవ్వాలని ఆకాంక్షించారు.
సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గుంటూరు నగరంలో సాంప్రదాయ సంక్రాంతి సంబరాల ద్వారా నగర వాసులను అలరించడానికి జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు కృషి అభినందనీయమన్నారు. గతంలో తాము పశ్చిమ ఎంఎల్ఏగా ఉన్నప్పడు కూడా సంబరాలు ఘనంగా నిర్వహించామని, ప్రస్తుతం తిరిగి ఆవిధంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ చాలా ఏళ్ల అనంతరం నగర ప్రజలందరినీ అలరించేలా కూటమి ప్రభుత్వ హయాంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్నారు. సంక్రాంతి అంటేనే ప్రతి ఇంట ఆనంద క్రాంతి వెళ్లివిరియడమని, ఇటువంటి సంబరాలు ప్రతి ఏడాది జరగాలని కోరారు.
నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ జిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులు అందరినీ అలరిస్తాయని, ప్రతి ఒక్కరూ సంబరాల్లో పాల్గొని ఆనందించేలా వివిధ కళారూపాలు, ప్రదర్శనలు ఉన్నాయన్నారు. సంబరాల్లో ప్రతి రోజు వయస్సుతో సంబందం లేకుండా వేల మంది ప్రజలు హాజరై ఆనందించారన్నారు.
జిఎంసి టిడిపి ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంధ్ర మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలను సంక్రాంతి సంబరాల ద్వారా నేటి తరానికి జిఎంసి అందించడం అభినందనీయమన్నారు. సంబరాల నిర్వహణలో నగర కమిషనర్, ఆర్గనైజింగ్ కమిటి, అధికారులు, కార్మికులు విశేష కృషి చేశారన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృత, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఈ.వరప్రసాద్, కె.కోటేశ్వరరావు, వి.పద్మజ, బాలాజీ, మీరావలి, చిస్టి, నిర్వహణ కమిటి సభ్యులు డి.శ్రీనివాసరావు, విజయలక్ష్మీ, కాశయ్య, నసీర్ అహ్మద్, లోకేశ్వరరావు, ఉషారాణి, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *