గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాభివృద్ధిలో సీనియర్ సిటిజన్స్ భాగస్వామ్యం ముఖ్యమని, అభివృద్ధి పనులపై తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు అందిచ డానికి శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాజధాని ప్రాంతంలో ఉన్నదని, అదే రీతిలో నగరాభివృద్దికి నగరపాలక సంస్థ పలు అభివృద్ధి పనులు చేపడుతుందని ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పలు ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు అనగా శంకర్ విలాస్ ఆర్ఓబి, గడ్డిపాడు ఆర్ఓబి పనులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కావున నగరంలో జరుగుతున్న మరియు విజన్ 2047లో గుంటూరు నగరాభివ్రుద్దికి చేపట్టవలసిన వివిధ ప్రాజెక్ట్ ల విషయాల పై సూచనలు సలహాలు అందించుటకు శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన ప్రతేక సమావేశానికి సీనియర్ సిటిజెన్స్ హాజరవ్వాలని కోరారు
Prajavartha Online Telugu News