Breaking News

ప్రధానమంత్రి విశిష్టత పురస్కారాన్ని దక్కించుకున్న నిషాంత్ కుమార్‌

అమరావ‌తి,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పరిపాలనలో మెరుగైన సేవలు అందించినందుకుగాను అబ్కారీ, నిషేధ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ కు ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఈ మేరకు నిషాంత్ కుమార్‌కు సమాచారం అందించారు. పార్వతీపురం మన్యం కలెక్టర్ గా “ప్రిజం 10” అమలులో మెరుగైన పనితీరును ప్రదర్శించినందుకు 2023 సంవత్సరానికి గాను ఈ విశిష్ట పురస్కారం లభించింది. ప్రజాసేవలో మమేకమై ఆ జిల్లాకు అందించిన విశిష్ట సేవలకు గాను నిషాంత్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తింపును ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్ల అత్యుత్తమ కృషిని గుర్తించి, పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డు నిర్దేశించగా, నిషాంత్ కుమార్ చేపట్టిన “ప్రిజం 10” కార్యక్రమం “ఇన్నోవేషన్-డిస్ట్రిక్ట్” విభాగంలో ప్రధానమంత్రి పురస్కారాన్ని దక్కించుకుంది. ఇది ప్రజా పరిపాలనలో ఉన్నతత సాధన కోసం నిషాంత్ చేసిన కృషిని ప్రతిబింబిస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *