Breaking News

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జనవరి 26 వ తేదిన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులకు సూచించారు.
గురువారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి అధికారులతో ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ , అభివృద్ది కార్యక్రమాలపై శకటాలు రూపొందించి పెరేడ్ లో ప్రదర్శించాలన్నారు. అలాగే స్టాళ్ళను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయం , హార్టి కల్చర్ , విద్య , వైద్య శాఖ, హౌసింగ్ , ఆర్ డబ్ల్యూ ఎస్. డీఆర్డీఏ , మెప్మా , పంచాయితీ రాజ్ , సివిల్ సప్లయిస్ , జియంసీ , ట్రాన్స్ కో , ఐసీడీఎస్ , అగ్నిమాపక శాఖల అధికారులు శకటాలను ఆకర్షణీయంగా రూపొందించి పెరేడ్ లో ప్రదర్శించేందుకు సిద్దపరచాలన్నారు. మైక్రో ఇరిగేషన్ , పశుసంవర్ధక శాఖ, హ్యాండ్ లూమ్స్ , సోషల్ వెల్ఫేర్ , అన్ని వెల్ఫేర్ శాఖలు , డిజేబుల్ వెల్ఫేర్ , మత్స్య శాఖ, డ్వామా , నైపుణ్యాభివృద్ది మరియు ఉపాధి కల్పన శాఖధికారులు స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. దేశ భక్తిని ప్రతిబింబించే విధంగా విద్యార్దులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఈఓ తగు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ఎలాంటి విద్యుచ్ఛక్తి అంతరాయం లేకుండా విద్యుత్ శాఖధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెరేడ్ గ్రౌండ్ నందు విద్యార్దులు , స్వాతంత్ర్య సమరయోధులు , జిల్లా ప్రముఖులు , అధికారులు , మీడియా వారు , ప్రజలు ఆశీనులు అయ్యేందుకు అవసరమైన గ్యాలరీల ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు చేపట్టాలని సూచించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పరిశుభ్రతతో పాటు పోలీస్ కవాతు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమన్వయం పరచుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జరిగే కార్యక్రమానికి ఓవరాల్ ఇన్చార్జి గా గుంటూరు ఆర్డిఓ మరియు పశ్చిమ తహశీల్దార్ పర్యవేక్షించాల్సి వుందన్నారు. పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ త్రాగునీరు , స్నాక్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్పీచ్ నోట్ తయారు చేసేందుకు అధికారులు తమ శాఖల్లో అమలు జరుగుతున్న అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలపై సంక్షిప్తంగా వివరాలు సోమవారం సాయంత్రం లోపు సిపిఓ కు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. తమ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికేట్ ను అందించేందుకు సంబంధించి వివరాలను కలక్టరేట్ కు సోమవారం సాయంత్రం లోపు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ షేక్. ఖజావలి , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డిఓ శ్రీనివాస రావు, జెడ్పి సిఇఓ జ్యోతిబసు, పీడీ డీఆర్ డీ ఏ , విజయలక్ష్మీ , పీడీ డ్వామా శంకర్ , పీడీ హౌసింగ్ ప్రసాద్, సిపిఓ శేషశ్రీ , డిఈఓ రేణుక , డిఎస్ ఓ కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ , జీయంసీ అదనపు కమిషనర్ ఓబులేశు, ఎల్ డి యం మహిపాల్ రెడ్డి , డీడీ మైన్స్ అండ్ జియాలజీ డి. శ్రీ వెంకట సాయి , డీడీ హార్టి కల్చర్ రవీంద్ర, డీటీసీ సీతారామి రెడ్డి, గుంటూరు తూర్పు, పశ్చిమ తహశీల్దార్లు నగేష్, వెంకటేశ్వర్లు , ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *