Breaking News

దుర్గమ్మవారిని దర్శించుకున్నడిజిపి ద్వారకా తిరుమల రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ అమ్మవారి దర్శనార్థం గురువారం  రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  ద్వారకా తిరుమల రావు, IPS దంపతులు ఆలయమునకు విచ్చేయగా అదనపు కమీషనర్ మరియు ఆలయ ఈవో కే. రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా, ఆలయ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాటు చేసియున్న బొమ్మల కొలువు, తదితర కళాకృతులను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తో పాటుగా డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు  ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *