-తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక సూళ్లూరుపేట లోని పులికాట్ సరస్సు దగ్గర అటకాని దిబ్బ వద్ద ఫ్లెమింగ్ ఫెస్టివల్ వేడుకల సందర్భంగా ఏర్పాట్లు చేసిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్చాoధ్ర – స్వచ్ఛ దివస్ ను నిర్వహించాలని తెలిపారు. పిల్లలందరూ మీ తల్లిదండ్రులకు తడి చెత్త, పొడి చెత్త గురించి తెలియ జేయాలన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు గురి కావాలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్లిన్ స్టార్ట్ థీమ్ తో ప్రారంభించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ చెత్తను ఎప్పటికీ అప్పుడు పరిశుభ్రం చేసుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకొనేల అవగాహన కలిగివుండాలన్నారు. చెత్త నుండి సంపద కేంద్రాన్ని తయారు చేసుకొని ఆ చెత్తను పొలాలకు ఎరువులుగా వాడుకోవాలని సూచించారు, మీ పంచాయతీను శుభ్రం చేసుకునేలా ముందు అడుగు వేయాలి ఈ పరిశుభ్రత కార్యక్రమం లో క్లాప్ మిత్రాలను అందరినీ అభినందన పరచాలని, వారి రక్షణకు కావాల్సిన పరికరాలను అందచేసెల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.మన చుట్టు ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటే దేశo, రాష్ట్రo కూడా బాగుంటుంది అన్నారు. అనంతరం స్వచ్ఛంద పై అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డి పి ఓ సుశీలాదేవీ, డి ఆర్ డి ఎ పి డి శోభన్ బాబు, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News