తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు కవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం, వేమన పద్యాలు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధర్వంలో యోగి వేమన జయంతినీ పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, డి ఆర్ ఓ నరసింహులు తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన తెలుగు పద్యాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని తెలిపారు. సరళమైన తెలుగు భాషలోని భారతీయ తత్వవేత్తగా, కవిగా యోగి వేమన గొప్ప పేరు గావించారని అన్నారు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైశిష్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించారని తెలిపారు. యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19 న రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News