-జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పర్యాటకులు
-ప్రతి ఒక్కరూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్శన చేసి ఫ్లెమింగో, పెలికాన్ వంటి పలు అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించండి: ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ
-ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు అందరికీ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆస్వాదించుటకు అన్ని ఏర్పాట్లు చేపట్టి ఘనంగా నిర్వహిస్తున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-విద్యార్థినీ విద్యార్థులతో కలిసి బోటులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మరియు ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ
తడ, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18న శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను సూళ్లూరుపేట నియోజక వర్గంలోని సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ప్రారంభం చేయడం జరిగిందని, సదరు ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలలో భాగంగా అటకాని తిప్ప పులికాట్ రక్షిత కేంద్రం నందు ఫ్లెమింగో పక్షుల వీక్షణ ఏర్పాటు, నేలపట్టు పక్షుల అభయారణ్యం నందు ఫెలికాన్ పక్షుల వీక్షణ ఏర్పాటు, బీవీ పాలెం నందు బోటింగ్, శ్రీ సిటీ నందు పలు మేధావులతో పర్యాటక అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి పర్యావరణ హిత అంశాలు, పులికాట్ సంరక్షణ తదితర అంశాలపై కాంక్లేవ్ ఏర్పాటు, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు, పలు శాఖల స్టాల్స్ ఏర్పాటు, పలు స్థానిక తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, పలు స్థానిక క్రీడలు ఘనంగా నిర్వహించుట కొరకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్శన చేసి ఫ్లెమింగో, పెలికాన్ వంటి పలు అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించండి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మరియు సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం రెండో రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 సందర్భంగా బీవీ పాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్ లో ఉత్సాహంగా ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న యువత, విద్యార్థిని, విద్యార్థులు పలువురు పర్యాటకులు, ప్రజలు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కలెక్టర్ మరియు ఎంఎల్ఏ బోటులో ప్రయాణించి మాట్లాడుతూ ఏర్పాట్లపైనా, పలు అంశాలపై వారి ప్రతిస్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వారి ప్రాంతంలో జరగడం పట్ల నియోజక వర్గ ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పలువురు పర్యాటకులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వారి అభిప్రాయాలు తెలుపుతూ ఇంత అద్భుతంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు కి, టూరిజం శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేశ్ కి , స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ కి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ కి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వివరిస్తూ ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఏర్పాటుతో, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి, అన్ని రకాల భద్రతా చర్యల నడుమ బోటు షికారు ఏర్పాట్లను చేసి అరుదైన ఫ్లెమింగో పక్షులను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. జిల్లా యంత్రాంగానికి పలువురు మనసార కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సందర్శకుల కోసం మెడికల్ క్యాంప్ ఉచిత తాగు నీటి సరఫరా చేశారని, స్టాల్స్ చాలా బాగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు బాగా ఉన్నాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, ఫైర్ తదితర అధికారులు ఉన్నారు.