సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను సూళ్లూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వీక్షించడానికి సందర్శకులు తండోప తండాలుగా విచ్చేసిన సందర్భంలో ఒక కుటుంబం లోని పాప తప్పిపోగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ వారి హెల్ఫ్ లైన్ స్టాల్ నందు ఫిర్యాదు చేయగా పోలీస్ వారు వెంటనే స్పందించి అబ్బాయి జాడను తెలుసుకొని వారి కుటుంబీకులకు అప్పగించిన పోలీస్ శాఖ అధికారులు. సీసీ కెమెరాల ఏర్పాటుతో, పక్కా భద్రత ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగానికి, పోలీస్ అధికారులు, సిబ్బందికి వారు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
