Breaking News

విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో పాటు భోజన సదుపాయం

-జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పులికాట్ ఫ్లెమింగో పక్షుల సందర్శన ఉచిత బస్సుల ఏర్పాటుతో పాటు భోజన సదుపాయం కల్పించుట జరిగింది

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా యందలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరికీ ఫ్లెమింగో పక్షుల గురించి పులికాట్ సరస్సు నందు పక్షుల యొక్క ఆగమనం మొదలగు విషయాలపై తెలియజేయు నిమిత్తం పూర్తిగా ఉచితంగా ప్రైవేటు యాజమాన్య పాఠశాలల బస్సుల ద్వారా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 లో భాగంగా చివరి రోజు అనగా తేది 20-01-25 న తిరుపతి జిల్లాలోని మూడు డివిజన్లు ( తిరుపతి, పుత్తూరు గూడూరు) నుండి సుమారు 3600 మంది విద్యార్థినీ విద్యార్థులు, 370 మంది ఎస్కార్ట్ ఉపాధ్యాయులతో” నేలపట్టు పక్షులు రక్షిత కేంద్రము, అటకాని తిప్ప పక్షులు రక్షిత కేంద్రం, బీములవారిపాలెం, శ్రీ సిటీ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట లోని స్టాల్స్” ను అన్నిటిని సందర్శించడం జరిగింది. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక ఎస్కార్ట్ టీచర్ను నియమించి జాగ్రత్తగా తీసుకెళ్లి విద్యార్థులను వారి గమ్య స్థానాల్లో చేర్చడం జరిగింది.

గౌరవ తిరుపతి జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ కె వెంకటేశ్వర్  ఆదేశములతో మూడు డివిజన్లు నుండి ఉచిత బస్సులను ఈ సందర్శనకు ఏర్పాటు చేయడంతో పాటు సందర్శించడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు “బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, దొరవారిసత్రం” ఆవరణ నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అందరికీ భోజన వసతిని కల్పించడం జరిగింది. చివరి రోజైన 20-1- 2025న సుమారు 2750 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ భోజన వసతిని ఉపయోగించుకొన్నారు.

“నేలపట్టు రక్షిత కేంద్రము ” “భీముని వారి పాలెం ” మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట గ్రౌండ్ నందు ఏర్పాటు చేయబడిన సాంస్కృతి కార్యక్రమాలు లో భాగంగా క్లాసికల్ డాన్సులు, మిమిక్రీ, గ్రూప్ డాన్సులు అటు విద్యార్థినీ విద్యార్థులను, తల్లిదండ్రులను, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సందర్శకులను ఎంతగానో అలరించాయి. కేవలం రాష్ట్రం నుండే కాకుండా చెన్నై మరియు బెంగళూరు రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడ సందర్శించడం ఒక విశేషం అని కెవిఎన్ కుమార్, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి, తిరుపతి జిల్లా వారు తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *