-ఈ నెల 20 వ తేది నుంచి 24 వ తేది వరకు జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు శిక్షణ అందించనున్నాం.
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యం లో ఎమ్ సి పి సి విధానం పై జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనా తో కూడిన శిక్షణ అందించడం జరుగుతొందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.
సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్ట్ కమిటీ (MCPC) ఆధ్వర్యంలో జిల్లాలోని జ్యుడీషియల్ అధికారులకు, న్యాయవాదులకు “మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్ & టెక్నిక్‌లు”పై ఈ నెల 20 వ తేది నుంచి 24 వ తేది వరకు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎమ్ సి పి సి మాస్టర్ ట్రైనర్ అధ్వర్యంలో అవగాహనా శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రథాన న్యాయమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసిపిసి కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం, రాజీ మార్గం అనే అంశం పై జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనా తో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జనవరి 20 వ తేది నుంచి 24 వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంసిపిసి యాక్ట్ ప్రకారం 2023 ప్రొవిజన్ ప్రకారం జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు సంబంధిత కేసుల్లో పరిష్కారం కొరకు నాలుగు విధానాలు ఉన్నాయన్నారు. ఇందులో మధ్యవర్తిత్వ రాజీ మార్గం.. లోకాదళత్ కూడా రెండు అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో మధ్యవర్తిత్వం కు సూచించిన కేసులకు సంబంధించి కేసు పరిష్కారం అయ్యే విధంగా శిక్షణ పొందిన
జ్యుడీషియల్ అధికారులకు, అడ్వకేట్లను నామినేట్ చేయటం జరుగుతుందన్నారు. వీరు సంబంధిత కేసు యొక్క ఇరు పార్టీలను పిలిపించి వారితో ఆమోదయోగ్యం దిశగా సంతకాలు చేయించి ఆరు నెలల లోపు కేసు పరిష్కారం అయ్యే విధంగా శిక్షణ పొందిన అడ్వకేట్ వారిని ఒకటి లేదా రెండు సిట్టింగుల్లో నిబంధనలు మరియు షరతులు మేరకు కేసు రాజీ అయ్యేవిధంగా పరిష్కరిస్తారన్నారు. ఇలా పరిష్కారమయ్యే కేసులకు లోకాదళత్ మాదిరిగానే అప్పీల్ కూడా ఉండదన్నారు. అదేవిధంగా కోర్టు కు చెల్లించిన ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున గౌరవ హైకోర్టు వారి సూచనల మేరకు జుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లను నామినేట్ చేసి నామినేట్ చేసిన కేసులను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ ఛైర్మన్ ఏ. గాయత్రి దేవి, డిఎల్ఎస్ఎ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు, సీనియర్ శిక్షకులు సురీందర్ సింగ్ (ఢిల్లీ), ఎస్. అరుణాచలం (తమిళనాడు) జ్యుడీషియల్ అధికారులు , న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News