విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మరియూ హైవే వారి సూచనల మేరకు దేశ వ్యాప్తంగా అబ్జర్వన్సి ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ జరుగుతుంది అని, ఈ నేపథ్యంలో స్టేక్ హోల్డర్ తో పాటు ఆయా ప్రాంతాల్లో యన్. జి ఓ సంస్థ ద్వారా రోడ్డు భద్రతా సూచనలతో విస్తృతంగా ప్రచారం చేయాలి అని, ఆర్. కనక దుర్గ పద్మజ మహిళ చే నడుపబడుతున్న రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ రూపొందించిన ” సడక్ సురక్ష జీవన్ రక్ష” అనే నినాదం తో జిల్లా రోడ్డు సేఫ్టీ అధ్యక్షులు బేతు రామమోహనరావు ద్వారా ప్రచార సామగ్రి ప్రారంభించటమ్ చాలా సంతోషం అని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ, యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన రావు తో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కనక దుర్గ పద్మజ సభ్యులు బంగారయ్య కోటేశ్వర రావు, కల్లి పరమ శివ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News