-76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్ధాలి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సిపి పి. రాజేశేఖర్‌బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సమైక్యత చాటి చెప్పేలా గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇందిరాగాంథీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సిపి బి. రాజేశేఖర్‌బాబు తెలిపారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 76వ గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సిపి పి. రాజేశేఖర్‌బాబులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత ఉట్టిపడే విధంగా వేడకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పరేడ్‌కు సిద్దంగా ఉంచాలన్నారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాకావిష్కరణ చేస్తారన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొనే గణతంత్ర వేడుకలకు తగిన విధంగా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి సిద్దంగా ఉంచాలన్నారు. ప్రధాన వేదిక, వివిఐపి, విఐపి గ్యాలరీలలో ప్రోటోకాల్ అనుసరించి సిటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వేడకలను వీక్షించేందుకు విచ్చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గణతంత్ర వేడుకలలో పాల్గొనే కంటెంజెట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని చాటేలా వివిధ శాఖల అలంకృత శఖటాలను ముందుగానే సిద్దం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. వేడుకల విషేషాలను ఎప్పటికప్పుడు అందించే వాఖ్యాతలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సును కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంపును, అంబులెన్సులను సిద్దంగా ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న గణతంత్ర వేడుకలను విజయవంతం చేయడంలో అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్దతో ఎటువంటి లోటు పాట్లకు తావులేకుండా శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు మట్లాడుతూ వేడుకలలో పాల్గొనేందుకు విచ్చేసే విఐపి వాహనాలకు ప్రత్యేక ప్రాక్సిమేట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు పరిసరాల ప్రాంతాలు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు వేడుకల రిహార్స్‌ల్స్ నిర్వహించి ఫుల్ డ్రస్ రిహార్స్‌ల్స్‌తో పరేడ్‌ను సిద్దంగా ఉంచలాన్నారు. వివిఐపి, విఐపిలు ఇతర ప్రజా ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక సీట్లలో అసీనులైయ్యేలా మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల్లో ఆర్మీ కంటెంజెంట్ రాష్ట్ర పోలీస్ బెటాలియన్స్, ఎన్‌సిసి స్కౌట్ అండ్ గైడ్స్, పోలీస్ బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటారన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో డిసిపి గౌతమిషాలీ, విజయవాడ ఆర్‌డివో చైతన్య, ముఖ్యమంత్రి భద్రత అధికారులు, రాజ్‌భవన్ అధికారులు పోలీస్,ఆర్‌అండ్‌బి, ఐఅండ్‌పిఆర్, రెవెన్యూ, ఆర్‌డబ్యుఎస్ విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News