తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి

-త్వరలో అన్ని చెరువులకు నీటి నింపుతాం
-రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
-పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ను నిర్వహించిన మంత్రి సవిత
-ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలి.. అధికారులకు మంత్రి సవితమ్మ ఆదేశాలు 

సోమందేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం తహసీల్దార్ వారి కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ప్రజలు, నాయకుల నుంచి పలురకాల అర్జీలను మంత్రి స్వీకరించారు. అక్కడికక్కడే పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యలను ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సదస్సులు, పల్లె పండుగలు , పొలం పిలుస్తోంది అంటూ అధికారులు ప్రజల వద్దకే పరిపాలన చేస్తున్నారు ఒకపక్క సంక్షేమంతో పాటు, అభివృద్ధి పనులు పోలవరం అమరావతి పనులు సాగుతున్నాయని మంత్రి తెలిపారు. సచివాలయ ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఆరు నెలల్లోనే సిసి రోడ్లు డ్రైనేజీలు గోకులం షెడ్లు తో పాటు మరెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్లు పెంచాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం త్వరలోనే తల్లికి వందనం ,మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం,రైతు భరోసా , కొత్త రేషన్ కార్డులుతో పాటు ,కొత్త పెన్షన్లు, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలు మంజూరు చేస్తామని అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను నీటితో నింపుతామని తెలియజేసిన మంత్రి సవితమ్మ. ఈ కార్యక్రమంలో RDO ఆనందరావు, DSP వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *