రాష్ట్రంలో నూతన విద్యా విధానం పై ప్రాంతీయ సదస్సు లో మేధోమథనం

– విద్యార్థుల్లో సృజనాత్మకత జోడించే సంస్కరణల దిశగా అడుగులు
– ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మానవ వనరులు అధికారులు, హెచ్ ఎం లతో సమావేశం
– హాజరైన తూర్పు, కోనసీమ, కాకినాడ జిల్లా కలెక్టర్లు
– విజయ రామరాజు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర్టంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఫలవంతమయ్యే సూచనలతో ముందుకు రావాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ రామరాజు అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో పాఠశాలల బలోపేతం అంశం పై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎంఈవో లు, హెచ్ ఎం లతో జోనల్ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ జోనల్ స్థాయి వర్క్‌షాప్ లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్. షాన్ మోహన్, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జి. నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాలోని జిల్లా, డివిజన్, మండల క్లస్టర్ స్థాయి మానవ వనరుల అధికారులకు శిక్షణతో కూడిన అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా విజయ రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం గా మానవ వనరులు విభాగంలో భాగస్వామ్యం అయిన మేధావి వర్గం తో అవగాహనతో కూడిన శిక్షణా కార్యక్రమాలను చేపట్టా మన్నారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 6, 7, 8 విద్యార్ధులు వున్న చోట ఉన్నత పాఠశాలను ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల తప్పని సరిగా వుండాలన్నారు. ఈ మేరకు ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రమేయం చాలా అవసరం అన్నారు. అందుకు అనుగుణంగా ఆయా సమన్వయ శాఖల అధికారులతో వర్క్‌షాప్‌ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.విద్యార్థుల్లో సృజనాత్మకత జోడించే సంస్కరణల దిశగా అడుగులు వేయడం ముఖ్యం ఉద్దేశ్యం అన్నారు. నూతన ప్రతిపాదిత విధానంలో విద్యార్థుల సంఖ్యను బట్టి… ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ, మోడల్ హైస్కూల్, హైస్కూల్ గా పాఠశాలల ఉన్నతి కరణ చేయడం కోసం జిల్లాలలో క్లస్టర్లు ఏర్పాటు , ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 25 పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీటిలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు క్లస్టర్ మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసామన్నారు. వారి అభిప్రాయాలను సమీకరించి ఒక సమగ్ర అధ్యయన నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తల్లిదండ్రుల కమిటీ (పీఎంసీ)ల అభిప్రాయాలు సేకరించామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ వార్డులో మోడల్ ప్రాథమిక పాఠశాలను గుర్తించడానికి పాఠశాలల పునర్నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు, క్లస్టర్ స్థాయి మరియు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల సామర్థ్యం మరియు సహజ సంప్రదింపుల సమగ్ర అధ్యయనం ఆధారంగా గుర్తింపు ప్రక్రియ జరగాలన్నారు. ఇందులో జిల్లా పాఠశాల విద్యాధికారి, డిప్యూటి, మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు కారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులు అభిప్రాయాలను సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల్య సంరక్షణ మరియు విద్య సజావుగా ఉండేలా,  ఉమ్మడి అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలతో అనుసంధానించడం గాని లేదా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను మార్చడం ద్వారా ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆమేరకు సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యా విధానం మరింత సమర్థవంతంగా, పటిష్ట స్థితిలో ఉంచేలా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గా ఆయన పేర్కొన్నారు. ఈ జోనల్ స్థాయి వర్క్‌షాప్ లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్. షాన్ మోహన్, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్  ఆర్. మహేష్ కుమార్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జి. నాగమణి , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి, కాకినాడ, బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రంపచోడవరం రెవిన్యూ డివిజన్ విద్యా శాఖ అధికారులు, డిప్యూటి డి ఈ వో లు, ఎంఈవో లు, హెచ్ ఎం లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *