Breaking News

దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోరాదు : మంత్రి పేర్ని నాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టులను ప్రస్తుతం ప్రభుత్వం ఏమీ భర్తీ చేయడం లేదని కొందరు దళారుల మాయ మాటలు నమ్మి తమ సొమ్మును పోగొట్టుకోరాదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు.
శనివారం  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తొలుత పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతానికి చెందిన కొటికలపూడి లక్ష్మణరావు మరికొందరు మంత్రిని కలిసి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉద్యోగం ఖాళీగా ఉందని, తమ స్నేహితులు పలువురు ఆ పోస్ట్ కోసం లక్షలాది రూపాయలు డబ్బులు చెల్లించి ఆ ఉద్యోగం కొనుగోలు చేసే ఉద్దేశ్యం లో ఉన్నారని, తమకు విద్యార్హత మినహా మరేమి లేదని మీరే దయ చూపి తనకు ఆ ఉద్యోగం పొందేలాగున సహాయం చేయాలని అభ్యర్ధించారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ లు ఏమీ లేవని అన్నారు. ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతూ నెలవారీ వేతనాలు పొందుతున్నా ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విషయంలో కరస్పాండెంట్లు సహా ఉపాధ్యాయులెవరూ ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వాటిని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఈ మేరకు కసరత్తు జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలనుకునే వారి నుంచి ఆమోద పత్రాలను కూడా ఇటీవల సేకరించిందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, జగనన్న విద్యాకానుక పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోందనీ, ఇవే పథకాలను ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నప్పటికీ విద్యార్థుల ప్రవేశాలు తగ్గడానికి కారణాలు తెలపాలంటూ తాఖీదుల్లో పొందుపరిచారని ఆయన వివరించారు. గత
మూడేళ్ల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని వివరణ ఇవ్వాలంటూ కోరుతూ ఆయా ఎయిడెడ్ విద్యాసంస్థలకు తాఖీదులు ఇవ్వడం సైతం జరిగిందన్నారు.ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వివరించారు. ఆయా పాఠశాలల నిర్వహణ మాత్రం ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయని ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వసతులు తదితర 30 అంశాలకు పైగా పరిశీలించి సమగ్ర విచారణతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు ఆదేశాలిచ్చిందన్నారు. మండలానికి సంబంధించి ఎంఈవో, ఇద్దరు ప్రధానోపాధ్యాయులతో కూడిన తనిఖీ బృందంతో నివేదిక తెప్పించుకోవాలని పేర్కొందన్నారు ఈ ప్రక్రియ పలు జిల్లాలలో ప్రస్తుతం కొనసాగుతోందని వివరించారు. ఎయిడెడ్ పాఠశాలలు, యాజమాన్యాలు అస్తులతో సహా పూర్తిగా అప్పగిస్తే ఆయా పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహించడమా? లేదంటే ప్రైవేటుగా కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదని మోసగాళ్లకు మీ సొమ్ము చెల్లించి నష్టపోవద్దని కొటికలపూడి లక్ష్మణరావు కు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
స్థానిక మాచవరం మెట్టు (2 వ డివిజన్ కు ) ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖమరున్నీసా మంత్రి పేర్ని నానిను కలిసి శిథిలావస్థకు చెందిన తమ దర్గాను బాగు చేయించాలని కోరింది.
తన భర్త హనుమంతరావు శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసి మరణించారని ఆయన ఫ్యామిలీ పింఛన్ తనకు వస్తుందని, గత మూడు నెలలుగా పింఛన్ ఆగిపోయిందని తన భర్త సర్వీస్ రికార్డ్ కార్యాలయంలో కనిపించకపోవడంతో మీ పెన్షన్ నిలిపివేశామని అధికారులు అంటున్నారని ఉప్పాడ సత్యవతి అనే వృద్ధురాలు మంత్రికి తన సమస్యను చెప్పుకొంది.
స్థానిక ఇంగ్లీష్ పాలెంకు చెందిన షేక్ మన్సూర్ ( చోటు ) అనే సరుకు మాస్టర్ (హోటల్ కార్మికుడు) మంత్రి వద్ద తన కష్టాన్ని చెప్పుకొన్నాడు. ఇటీవల వరకు కొనసాగిన కర్ఫ్యూ కారణంగా తానూ పని చేస్తున్న హోటల్ లో ఉద్యోగం పోయిందని అయిదుగురు కుటుంబ సభ్యులతో పలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకొన్నాడు.
స్థానిక పరాసుపేటకు చెందిన మహ్మద్ మక్బుల్ తన కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నడని మూడవ సంవత్సరం ఫీజు రీయంబర్స్మెంట్ ఇంకా రాలేదని మంత్రికి విన్నవించారు.
తనకు డ్రైవింగ్ వచ్చని ఎల్ ఎం వి బ్యాడ్జ్ ఉందని ఏదైనా డ్రైవర్ ఉద్యోగం ఇప్పించమని స్థానిక వలంధపాలెంకు చెందిన పామర్తి వెంకటరావు అనే పెట్రోల్ బ్యాంకు కార్మికుడు మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించారు. మీ వివరాలు ఇవ్వడి డ్రైవర్ పోస్టుల ఖాళీలు వచ్చినప్పుడు మీకు నేను తెలియచేస్తానని మొబైల్ నెంబర్ తన కార్యదర్శికి ఇచ్చి వెళ్లాలని మంత్రి సూచించారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *