అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్.సురేశ్ కుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఐఅండ్ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేశ్ కుమార్ ను పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సురేశ్ కుమార్ ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ అధికారులు,ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News