విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొణకళ్ల నారాయణరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిలు పాల్గొని కేక్‌ని కట్ చేసి లోకేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు
ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా, ఐటీ శాఖామాత్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులందరూ లోకేష్ జన్మదినాన్ని అత్యంత ఉత్సహంగా జరుపుకోవటం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, పార్టీ ఉత్తరాధికారిగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి లోకేశ్, ఆయన పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే ఈ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఎలా ఎదిగింది, ఎలా ప్రజలకు దగ్గరైంది చూస్తే అదే క్రమంలో ఆ రకంగానే ఈ 40ఏళ్ల లోకేష్ యొక్క ప్రస్థానం మనకు కనపడుతుంది, 40 ఏళ్లు తక్కువ వయస్సే కానీ ఆయన బాల్యం, స్టాన్ ఫోర్డ్‌లో ఉన్నత విద్యనభ్యసించడం, తర్వాత వచ్చి ఈ రాజకీయాల్లోనే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక స్పష్టమైన దృష్టితో చేరడం, మరి స్వల్ప కాలంలోనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదగటం, లక్షలాది కార్యకర్తల ప్రేమాభిమానాన్ని చూరగొనటం, అంతేగాకుండా తెలుగుదేశం పార్టీకి ఈ ఆధునికమైన సాంకేతిక యుగ ప్రస్తానంలో ఆయన ఒక్క కొత్తగా పార్టీ నిర్మాణాన్ని అందులో కార్యకర్తల సంక్షేమాన్ని వారి యొక్క బాగోగులను చూసుకోవటం అనేది లోకేష్ గారు ప్రారంభించిన ఒక కొత్త ధనం తెలుగుదేశం పార్టీకి చేకూరింది. ఎప్పుడో 1987లో పార్టీ పుట్టినప్పుడు ఒక రెండేళ్ల అనంతరం చంద్రబాబు గారు పార్టీ నిర్మాణానికి పూనుకుని పార్టీని కిందిస్థాయి నుంచి పునాది వేశారో, ఆ పునాదే నేటికీ తెలుగేదేశం పార్టీకి పట్టు కొమ్మగా ఉన్న స్థితి మనకు తెలుసు, అలాంటి నిర్మాణాన్ని ఈ కొత్త సాంకేతికయుగంలో లోకేష్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షించి గతంలో మంత్రిగా 5 సంవత్సరాల పరిపాలన కాలంలో సమర్థత చూపించారు, పంచాయితీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి పాల్పడిన చరిత్ర మనకు కనపడుతుంది. నేడు మళ్లీ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన చేస్తున్న చొరవ, సమర్థత గాని ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి తరానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని ఆయన పడుతున్న తపన, అందుకు చేపడుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా మనకి అద్దంపడుతున్నాయి. నేడు దావోస్‌లో వ్యవహరిస్తున్న తీరు, ఇప్పటికే దాదాపు దావోస్‌లో ఇచ్చిన రెండు వేదికల మీద ఆయన కనబర్చిన సమర్థత ప్రశంసనీయం, అతి త్వరలో ఈ రాష్ట్రానికి రాబోయే కొద్ది సంతవ్సరాల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు పడుతున్న శ్రమ మనందరం చూస్తున్నాం..
లోకేష్‌కు మంచి భవిష్యత్తు ఉంది, ఆయన చేతుల్లోనే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, ఈ ఆధునిక సాంకేతికయుగంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆశాజ్యోతిగా ఆయన కనపడుతున్న వాస్తవాన్ని మనం చూస్తున్నాం, నేడు లోకేష్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల తెలుగుదేశం పార్టీ యావత్తు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ఆయన యొక్క ఈ రాష్ట్రంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దబడటానికి అడుగులు మరి విజయవంతం కావాలి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరుతూ ఏ పార్టీలో లేనట్లుగా పార్టీ కార్యకర్తల కష్టమొస్తే, చనిపోతే వారికి ఇన్సురెన్స్ అందేలాగా వారి కుటుంబ సభ్యులకు ఉచితవిద్య అందించేలా ప్రణాళిక రూపొందించారు, నేడు భారతదేశంలోనే ఏ పార్టీకి లేని కోటి పైగా సభ్యత్వాని పూర్తి చేసిన ఘనత లోకేష్ ది,
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రం మొత్తం యువగళం పాదయాత్ర చేసి, ఆనాటి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు బనాయించినా ఆ కేసుల్ని ఎదుర్కొంటూ, అడ్డంకుల్ని అధిగమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు,
విద్యావంతుడిగా, అమెరికాలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఒక అవగాహన కలిగినటువంటి నాయకుడు, రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్ కి మనవడు, చంద్రబాబు గారికి కొడుకు, వారి కుటుంబంలోనే రాజకీయం ఉంది, ప్రజలకు సేవచేయాలనే తలంపుతో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలపాలని తండ్రి గారి ఉద్దేశ్యానికి వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా నంబర్ 1గా నిలపాలి, జగన్‌మోహన్‌రెడ్డి పాలన పాడైన పారిశ్రామిక విధానాన్ని, ఉద్యోగ సమస్యను పరిష్కారంకై దావోస్ వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావాలని ఆహ్వానం పలుకుతున్నారు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగ సమస్య పరిష్కరించటానికి కృషిచేస్తున్నారు.
గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ మంత్రి లోకేష్ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, రాబోయే 40 సంవత్సరాల కాలానికి లోకేష్ నాయకత్వం పార్టీకి లభిస్తుందని, ఎన్టీఆర్ గారు 40 ఏళ్ల క్రితం పార్టీ ప్రారంభించారు, లోకేశ్ సారథ్యంలో ఇంకో 40 ఏళ్లు ముందుకెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు, పార్టీ శ్రేణులు, నాయకులు అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం, పార్టీ యువనేత నారా లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రిగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం శ్రమించారని, కేంద్ర పంచాయితీరాజ్ శాఖ దేశం మొత్తం మీద 10వేల కి.మీ సీసీ రోడ్డు వేస్తే.. ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే 13వేల కీ.మీ సీసీ రోడ్లు వేసిన ఘనత లోకేష్‌కే దక్కిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివప్రసాద్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు షేక్ నాగూర్‌వలి, చెన్నుపాటి ఉషారాణి, ఊర్ల మోహనరావు, సోలంకి రాజేంద్ర కుమార్, పార్టీ నాయకులు కోగంటి రామారావు, ఎస్.ఎం. ఫైజాన్, పరిశపోగు రాజేష్, పొన్నం రవికుమార్, యార్లగడ్డ సుచిత్ర, బంకా నాగమణి, పామర్తి కిశోర్‌బాబు, బత్తుల దుర్గారావు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, చిట్టా నిర్మల, కోడూరు ఆంజనేయవాసు, జాస్తి సురేష్, పాలడుగు దుర్గాప్రసాద్, కాకు మల్లికార్జున యాదవ్, కత్తుల మణికంఠ, ఆనంద విశ్వరూప్ మరియు భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News