-ఎంపి కార్యాలయంలో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ ఆరాచక విధానాలను నిగ్గదీసి, ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటు లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలకపాత్ర పోషించారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు, నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు అందించేందుకు నిరంతరం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ ఎంపి కేశినేని చిన్ని కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపి కేశినేని శివనాథ్ కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి రథసారథిగా అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రతిక్షణం శ్రమిస్తున్న ప్రజాసేవకుడు లోకేష్ అంటూ కొనియాడారు. రాష్ట్రంలోని యువతకు అత్యున్న ఉపాధి అవకాశాలు అందించాలని ప్రపంచ స్థాయి కంపెనీలకు రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామ రాజు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, మాజీ మేయర్ తాడి శకుంతల,టిడిపి సీనియర్ నాయకులు కోగంటి రామారావు,నరసింహాచౌదరి, తుమ్మాటి ప్రేమ్ నాథ్, జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు కరీముల్లా, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సొలంకి రాజు, ఎన్.ఎస్.పి కమిటీ చైర్మన్ కోట వీరబాబు, పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతురావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అర్బన్ ఉపాధ్యక్షుడు దోమకొండ రవికుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళితరత్న),అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఇర్ఫాన్, టిడిపి నాయకులు యెర్నేని వేదవ్యాస్, కాకు మల్లిఖార్జున యాదవ్, వూర్ల మోహన రావు, కొత్తపల్లి స్వరూప్ ఆనంద్ లతో పాటు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News