Breaking News

పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి కార్యక్రమం…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, ఆటోనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో కీ.శే. పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర  చిత్ర పటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ నాగూర్ వలీలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, చెన్నుపాటి గాంధీలు మాట్లాడుతూ పరిటాల రవి సేవలను మరువలేమని, కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలో పరిటాల రవి తీసుకొచ్చారని, పేద వర్గాల వారికి ఎంతో కృషి చేసి వారికి అండగా నిలిచారని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు

నూతలపాటి నాగభూషణం, షేక్ నాగూర్ వలి మాట్లాడుతూ పరిటాల రవి జిల్లాలోని ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చే అన్నగా చెరగని ముద్ర వేసుకున్నారని, పరిటాల రవి లేని లోటు పార్టీకి తీరనిలోటని, ఆయన ఆశయ సాధనాల కోసం ఈనాటి యువత పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యలమంచిలి దేవేందర్, యార్లగడ్డ రమేష్, రామినేని రవి, వెంకటేశ్వరరావు, యువత నాయకులు బి. ప్రదీప్, జి. ప్రకాష్, కాసుల శ్రీనివాస్, హజరతయ్య, షేక్ హనీఫ్, పులిపాటి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *