Breaking News

బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాస్ చైల్డ్ ఫండ్ సంయుక్త ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో డిసిపిఓ శివశంకర్ మాట్లాడుతూ బాలికల విద్యా బాలికలపై జరిపే దూషణలు మరియు పిల్లల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థల గురించి వివరించడం జరిగినది. ఐసిడిఎస్ సూపర్వైజర్ అనంతలక్ష్మి బాలికలు పోషకాహారంతోపాటు మంచి విద్యను అందుకున్నప్పుడే ఆరోగ్య వంతమైన సమాజానికి దోహద పడగలరని వివరించడమైనది . రాస్ బాలాజీ బాలవికాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలకు ఉన్నటువంటి హక్కుల గురించి మరియు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగినది . ప్రధానోపాధ్యాయురాలు విష్ణు వర్థిని గారు మాట్లాడుతూ అమ్మాయిలు క్రమశిక్షణతో ఉన్నప్పుడే చదువుతోపాటు మంచి నడవడిక అలవాటు అవుతుందని కుటుంబానికి ,సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకు రాగలరని తెలియజేయడం జరిగినది, కౌన్సిలర్ కలపన మాట్లాడుతూ ఆడపిల్లలపై జరిగే దూషణల గురించి వివరిస్తూ ప్రతిక్షణం అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా పెద్దలకు తెలియపరచాలని తెలియజేయడం జరిగినది.జన విజ్ఞాన వేదిక వెంకటరమణ ఆడపిల్లలపై జరిగే అరాచకాలను ధైర్యం ఎదుర్కోవాలని అటువంటి సందర్భాల్లో విషయాలను దాచి పెట్టకుండా పెద్దలకు, పేరెంట్స్కు , టీచర్లకు తెలియపరచాలని అమ్మాయిలకు సూచించడమైనది ఆకాంక్ష సంస్థ అధిపతులు రవికుమార్ గారు మాట్లాడుతూ ఆడపిల్లల విద్యకు మంచి అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని వాళ్ల కాళ్లపై నిలబడి సమాజానికి దేశానికి ఉపయోగపడాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మిషన్ వాత్సల్య సిబ్బంది మహిళా పోలీసులు పూర్ణిమ నాగమణి కోఆర్డినేటర్లు శైలజ భారతి నాగేంద్ర మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *