మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పంపిణీ వ్యవస్థలో 6ఏ కేసులలో స్వాధీనం చేసుకున్న 739.11 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యావసర వస్తువుల చట్టం, 1955 క్రింద 6-A కేసులలో 739.11 క్వింటాళ్ళ ప్రజా పంపిణీ బియ్యానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ సమక్షంలో వారి ఛాంబర్, మచిలీపట్నం వద్ద ఈ నెల 31 వ తేదీ ఉదయం 10.30.గంటలకు బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
వేలములో పాల్గొనే వారు ముందు రోజు అనగా ఈనెల 30 వతేదీ లోగా జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం మచిలీపట్నంలో ఉన్న శాంపిల్ పిడిఎస్ బియ్యాన్ని పరిశీలించుకొని వేలం తేదీ అనగా ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలలోపు ధరావత్తు కింద Rs.50,000/-ల చొప్పున జిల్లా పౌరసరఫరాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారికి చెల్లించి నిర్ణీత నమూనాలో దరఖాస్తులను సమర్పించి వేలంపాటలో పాల్గొనవచ్చునన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు విధిగా తమ యొక్క జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రతిని, ధరావత్తు సొమ్ముతో పాటుగా వేలంపాట సమయంలో సమర్పించవలసి ఉంటుందన్నారు. 6-A కేసులు నమోదు అయి పెండిగులో ఉన్నవారు వేలము పాటలో పాల్గొనేందుకు అనర్హులని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ స్పష్టం చేస్తూ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News