అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Tags AMARAVARTHI
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …