కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాలు నందు శనివారం నిర్వహించాల్సి ఉన్న కౌన్సిల్ వారి ప్రత్యేక సమావేశం కోరం సభ్యులు లేనందువల్ల వాయిదా వేస్తున్నట్లు కొవ్వూరు పురపాలక సంఘం ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి ప్రకటించారు. తదుపరి ప్రత్యేక సమావేశం తేదీని సభ్యుల కు తెలియ చెయ్యడం జరుగుతుందని ఆమె తెలిపారు.
