Breaking News

క‌లెక్ట‌రేట్‌లో ఘనంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం 76వ భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని విజ‌య‌వాడ‌లోని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ డా. జి. లక్ష్మీశ జాతీయ జెండాను ఎగుర‌వేసి వంద‌న సమర్పణ చేశారు. ప్ర‌జ‌ల‌కు గ‌‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జాతిపిత మ‌హాత్మా గాంధీ, డా . బీఆర్ అంబేద్కర్ చిత్ర‌పటానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, క‌లెక్ట‌రేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

శనివారం 76వ భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని విజ‌య‌వాడ‌లోని పోలీసు పరేడ్ మైదానంలో క‌లెక్ట‌ర్ డా. జి. లక్ష్మీశ జాతీయ జెండాను ఎగుర‌వేసి వంద‌న సమర్పణ చేశారు. ప్ర‌జ‌ల‌కు గ‌‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *