విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నుంచి వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ ఎం.సుహాసిని ప్రశంసా పత్రం అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి, సామాజిక సేవలో భాగస్వాములవుతున్న విశిష్ట మహిళగా ఉత్తమ సేవలకు గాను ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా ఎం.సుహాసిని, డిఎంహెచ్ఒ మాట్లాడుతూ తనవంతుగా నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, ఈ విధంగా ప్రజలకు సేవలు అందిస్తూ తన తోటి వైద్యులు, సిబ్బంది సహకారంతో కొనసాగుతున్న నాకు ఈ పురస్కారం మరింత భాద్యత పెంచిందన్నారు.
Prajavartha Online Telugu News