విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం 18వ డివిజన్ రాణిగారితోట కనకదుర్గమ్మ మరియు గంగానమ్మ నిర్వహించిన బోనాల జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పూజలు జరిపారు. మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, ప్రజలు, రైతులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న అని అన్నారు.అనంతరం కనక దుర్గమ్మ గుడి నుండి బోనమెత్తి ఊరేగింపుగా బయలుదేరారు. ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరి పై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు
Tags vijayawada
Check Also
స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మన్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ టూర్ లో పాల్గొన్న విజయవాడ ఎంపి , …