నేటినుంచి ఉధృత అతిసార నివారణ పక్షోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె. నివాస్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 నుంచి ఆగస్టు 10 వరకు ఉధృత అతిసార నివారణ ప క్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డియంహెచ్ వొ డా.యం.సుహాసిని ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ,వార్డ్,పట్టణ, ప్రభుత్వ వైద్యశాలల్లో ఒఅర్ ఎస్,జింక్ కార్నర్ ల్లు ఏర్పాటు చేసి డయేరియా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారన్నారు. ఆ మేరకు గ్రామ,పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఒఅర్ ఎస్, జింక్ ఉపయోగలపై తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేతులు పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఒఆర్ ఎస్ ను ఉపయోగించే విధానం, జింక్ టాబ్లెట్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయబడుతుందన్నారు. జింక్ టాబ్లెట్స్ ఇచ్చుటవలన డ యేరియా ఉధృతి తగ్గటం,విరోచనలు గట్టిపట్టుట,కోల్పోయిన బరువు ,నిస్సత్తువను పునరుద్ధి0చు విధానాలను అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వివరించబడతాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *