గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎన్నికల కోసం గుంటూరు తూర్పు (94), పశ్చిమ నియోజకవర్గం(95)ల్లో 1000 మంది దాటిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ చేస్తూ ప్రకటించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గం ఏఈఆర్ఓ, జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూగుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో 1000 మందికి మించిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను, అదే ప్రాంతంలో మరొక కేంద్రం ఏర్పాటుకు డ్రాఫ్ట్ తయారు చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీల ప్రతినిధులు డ్రాఫ్ట్ పై ఏ విధమైన అభ్యంతరాలు తెలపలేదని పేర్కొన్నారు.
సమావేశంలో ఏఈఆర్ఓలు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సూరజ్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ పద్మనాభరావు, డిప్యూటీ తహసిల్దార్ నాగ మల్లేశ్వరరావు, నాయుడు ఓంకార్ (టిడిపి), పాండురంగ విఠల్ (బిజెపి), సిహెచ్.వాసు (బిఎస్పీ), బి.సునీల్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) కె.నళినికాంత్(సిపిఐ(ఎం), టి.సేవా కుమార్ (అమ్ ఆద్మీ పార్టి), సిహెచ్.రామ వెంకట త్రినాద్(జనసేన) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News