Breaking News

ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు అధికారులకు సూచనలు

ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు ఏర్పాట్లను సెనేట్ హాల్ నందు పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్

పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు జెసి ఛాంబర్ నందు అందజేయాలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పలు జిల్లాలలో డిప్యూటీ మేయర్ ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నిక కార్యక్రమ ప్రత్యేక సమావేశం ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఎలెక్షన్ అథారిటీ మరియు డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు జెసి గారిని సదరు ఎన్నికల నిర్వహణ ప్రిసైడింగ్ అధికారిగా నియమించగా శుభం బన్సల్ గారు స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు పలు ఏర్పాట్లపై సంబంధిత సిబ్బంది, అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తగినంత బందోబస్తు ఏర్పాటు, హాల్ నందు సీటింగ్ ఏర్పాట్లు, మీడియా ఏర్పాట్లు తదితర అంశాలు నిబంధనల మేరకు ఉండాలని, అలాగే ఎన్నికల ప్రక్రియ పూర్తి వీడియో రికార్డింగ్ ఉండాలని సూచించారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ గారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు అందజేయాల్సి ఉంటుందని, కలెక్టరేట్ నందు జేసీ చాంబర్ నందు వారు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫిబ్రవరి మూడో తేదీ ప్రత్యేక సమావేశం 11 గంటలకు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గం.ల కంటే ముందుగా సెనేట్ హాల్ నందు హాజరు కావాలని, సెల్ ఫోన్లు అనుమతి లేదని, ఐడి కార్డు తీసుకుని రావలసి ఉంటుందని ఎన్నికల నిర్వహణ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహర చారి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అమరయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీ, తాసిల్దార్ అర్బన్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *