-ఆకుల శ్రీనివాస కుమార్, కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకుల శ్రీనివాస కుమార్, కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ, భవాని పురంలో కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ జరిగింది. ఆకుల శ్రీనివాస కుమార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ భవాని పురం ఆకుల రాజేశ్వరరావు వీధిలోని ఆకుల శ్రీనివాస కుమార్ ఆఫీస్ వద్ద స్థానిక ప్రజలకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరియు 50 వయస్సు పై వారికి 2,000 మంది కి అభినవ ధన్వంతరి కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పి.సి.సి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు గొలగాని రవికృష్ణ తన తల్లిదండ్రులు పేరు మీద గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగకరంగా ఉన్నాయని గొలగాని రవి కృష్ణకు అభినందనలు తెలిపారు. రాజకీయ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా రవి కృష్ణ ఇప్పటికే కృష్ణ , గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో 40000 వేల మందికి కరోనా నివారణ మందు పంపిణీ చేసారని, ఆయన చేస్తున్న ఈ సేవ కార్యక్రమాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరోనా మహమ్మారి వల్ల కరోనా వాక్సిన్ అందరికి రాష్ట్ర ప్రభుత్వం అందివ్వలేని ఈ పరిస్థితిలో అభినవ ధన్వంతరి ఆనందయ్య కరోనా నివారణ మందు సంజీవని లాగా పనిచేస్తూ ఎంతో మంది ప్రజల ప్రాణాలు కోల్పోకుండా అద్భుతంగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల కిరణ్, కాంగ్రెస్ మహిళ నాయకురాలు మల్లికా రెడ్డి, కాంగ్రెస్ బి.సి సెల్ ఛైర్మన్ దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ ఎస్. టి.సెల్ ఛైర్మన్ కిషోర్, కాంగ్రెస్ ఎస్. సి.సెల్ ఛైర్మన్ పొదిలి చంటి బాబు, కాంగ్రెస్ కాపు సెల్ ఛైర్మన్ దూబా తిరుపతి నాయుడు, గోపు గంగాధర్, జనసేన నాయకులు తిరుపతి సురేష్, తిరుపతి అనూష, కురాకుల సురేష్, ఐ. యం. యూ.ఎల్. నాయకులు ఫక్రుద్దీన్, నగర నాయకులు అల్లం పూర్ణ చంద్ర రావు, సుబ్బారెడ్డి, వెంగళ రెడ్డి, యశోద కృష్ణ సేవ సమితి అధ్యక్షులు దుక్కా వేణు, విజయవాడ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తోట కోటి, దొరం లోకేష్, విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.