Breaking News

ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా క్లస్టర్ విధానం

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాఠశాలలో పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పాఠశాలల పై పర్యవేక్షణ విధానం పై జిల్లా కలెక్టర్ కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, డి ఈ. ఓ కె వి.ఎన్ కుమార్ తో కలిసి ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎం లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ను అందిoచే దిశగా నూతనంగా తీసుకొచ్చిన క్లస్టర్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. జిల్లాలో 130 క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి క్లస్టర్లో 5 నుంచి 10 వరకు పాఠశాలలు ఉంటాయని, ఒక్కో పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య సెంటర్ను బట్టి ఆ పాఠశాలను మోడల్ పాఠశాలలుగా ఏర్పాటు చేయడం ఉంటుందని తెలిపారు. ఈ మోడల్ స్కూల్లో ఐదు మంది ఉపాధ్యాయులు ఉంటారని, 60 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 60 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలను బేసిక్ ఫౌండేషన్ పాఠశాలలుగా ఉంటాయన్నారు. గ్రామాల్లో బ్రిడ్జిలు, చెరువులు దాటడం, ఎక్కువ దూరం 5 కి.మీ ప్రయాణం చేసే పాఠశాలకు వెళ్ళే పిల్లలకు రవాణా చార్జీలు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ బాలాజీ డిప్యూటీ ఈవో లు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *