Breaking News

ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్ నే ధరించాలి…

-నాశిరకం హెల్మెట్ అమ్మినా ధరించినా చర్యలు తప్పవు…
-అడిషినల్ డిసిపి టి.సర్కార్, డిటిసి యం. పురేంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు మేరకు ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్లు మాత్రమే ధరించాలని నాశిరకం హెల్మెట్ ధరించినా అమ్మకాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుని జరిమానాలు విధించడం జరుగుతుందని అడిషినల్ డిసిపి టి.సర్కార్, రవాణా శాఖ డిటిసి యం. పురేంద్రలు అన్నారు. “వీడు’ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై సోమవారం విజయవాడ ఉపరవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో అడిషినల్ డిసిపి టి.సర్కార్ , డిటిసి పురేంద్ర, ఏసిపి జె.వెంకటనారాయణలు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా అడిషినల్ డిసిపి సర్కార్ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారుల ప్రాణరక్షణ కొరకు ప్రభుత్వం హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధించడంతోపాటు లైసెన్లను రద్దుచే సేలా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్ లను మాత్రమే ధరించాలని ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు పెట్టడం జరిగిందన్నారు. అయితే ఇటీవల బహిరంగ మార్కెట్లు, ప్రదేశాలలో విచ్చలవిడిగా డూప్లికేట్ ఐయస్ఈ మార్క్ కలిగిన నాశిరకం హెల్మెట్లను విక్రయించడం జరుగుతోందన్నారు. వాహనదారులు వాటిని కొనుగోలు చేసి డబ్బునష్టపోవడంతోపాటు ప్రాణరక్షణకూడా లేకుండా చేసుకుంటున్నారన్నారు. నాశిరకం హెల్మెట్ల అమ్మకం నేరమని అటువంటి వారిపై విజిలెన్స్ దాడులు నిర్వహించి భారీ జరిమానాలను విధిస్తామని ఇప్పటి కైనా నాశిరకం హెల్మ్ లు అమ్మకాలను నిలిపివేయాలని ఆయన అమ్మకందార్లను హెచ్చరించారు.
ఉపరవాణా కమిషనరు యం. పురేంద్ర మాట్లాడుతూ గత జూన్ నెల 1వ తేదీ నుండి ఐయప్స్ 4051-2015 మార్క్ హెల్మెట్ మాత్రమే ధరించేలా ప్రభుత్వం తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. నాశిరకం హెల్మెట్లు ధరించి వాహనాలు నడపడం వలన ప్రమాదసమయాలలో ప్రాణాలను రక్షించుకోలేని పరిస్థితులు ఎదురైన సందర్భాలు ఉన్నాయన్నారు. అందుకే ద్విచక్రవాహనదారులకు ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్ కు నాశిరకం హెల్మెట్ కు ఉన్న వ్యత్యాసాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. నాశిరకం హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనం నడిపినట్లయితే హెల్మెట్ లేనిట్లుగా పరిగణించి జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నాశిరకం హెల్మెట్ లను నివారించేందుకు పోలీస్ అధికారుల సమన్వయంతో విస్తృతంగా దాడులను నిర్వహించనున్నట్లు తెలిపారు. నాశిరకం హెల్మెట్లు తయారు చేసినా అమ్మినా అటువంటివారి పై భారీ మొత్తంలో జరిమానాలు విధించి చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని పురేంద్ర హెచ్చరించారు. వాహన డీలర్లు వాహనాల అమ్మకం సమయంలో తప్పనిసరిగా ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్లను మాత్రమే కొనుగోలుదారులకు అమ్మాలన్నారు. రానున్న రోజుల్లో షోరూమ్లపై కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ద్విచక్రవాహనాలు విక్రయించే సమయంలో కొనుగోలుదారులకు నాశిరకం హెల్మెట్లు అందజేస్తున్నట్లు గుర్తిస్తే ఆషోరూమ్ యజమానుల పై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారుల్లో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ‘వీడు’ స్వచ్ఛంధ సంస్థ ముందుకు వచ్చి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు యం. వాసు బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. జిల్లా వ్యాప్తంగా మోటారు వాహన తనిఖీ అధికారులతో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
తొలుత హెల్మెట్ వాడకంపై బుర్రకధ కళారూపం ద్వారా అవగాహన కలిగించడంతో పాటు నాశిరకం హెల్మెట్ వలన కలిగే నష్టాలను ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్ కు నాశిరకం హెల్మెట్ కు గల తేడాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం ఒరిజినల్ హెల్మెట్లను ధరించి ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించారు.
అవగాహనా కార్యక్రమంలో ఏసిపి జె. వెంకటనారాయణ, రవాణాశాఖా ఆర్ టిఓలు కె. రామప్రసాద్, ఏ. విజయసారథి, మోటారు వాహన తనిఖీ అధికారులు జి.సంజయ్ కుమార్, డియస్ యస్. నాయక్, ‘వీడు’ స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు యం. వాసు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజూబాబు, పలువురు ద్విచక్రవాహనదారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *