-జిల్లా కలెక్టర్ జె. నివాస్ చొరవతో 2950 మంది ఇళ్ళ నిర్మాణానికి రుణ సౌకర్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ బ్యాంక్ మైక్రోశాట్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కేటాయించిన ఇంటి స్థలంపై ఎస్ హెచ్ జి గృహలక్ష్మీ పధకం ద్వారా గృహ నిర్మాణానికి 2950 మందికి రూ.14.75 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె.వి.రాజశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈనెల 27 వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు లబ్ధిదారులకు ఎస్ హెచ్ జి గృహలక్ష్మీ రుణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్(సంక్షేమం) కె.మోహన్ కుమార్ ,ఎల్ డియం రామమోహనరావు,డి ఆర్ డిఏ పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి ప్రకాశరావు తదితరులు పాల్గొంటారు.