విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని ట్రస్టు బొర్డుల నియమకం త్వరలో పూర్తి చేయాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి అదేశించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రహ్మణవీధిలోని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డాక్టర్ జి వాణి మోహన్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ , రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, భ్రమరాంభ తదితరులు ఉన్నారు. సీఎం జగన్ మెహన్ రెడ్డి అదేశాలతో ఇప్పటికే చాలా దేవాలయాలకు ట్రస్టు బొర్డుల నియమకం జరిగిందని, మిగిలిన ట్రస్టు బొర్డుల నియమకం కూడా తర్వతగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి అదేశించారు.. అదే విధంగా దేవదాయ శాఖ పరిధిలో ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో కూడా చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల ప్రయోషన్ విషయంలో కొర్టు వివాదాలు లేకుండా న్యాయపరమైన అంశాలను పరిశీలించి చాలా కాలంగా ప్రయోషన్ కోసం వివిధ స్థాయిలో ఉన్నావారికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులను మంత్రి పాలనపరమైన అంశాలను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
Tags vijayawada
Check Also
గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి వేదిక రెవెన్యూ సదస్సులు
-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు -కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : …