Breaking News

పాస్‌పోర్ట్ కావాలంటే దగ్గరలోని పోస్టాఫీస్ సందర్శిస్తే సరిపోతుంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎంఇఎ’ నిర్వహిస్తున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజల సౌలభ్యం కోసం మరో సౌకర్యం కల్పించారు. పాస్‌పోర్ట్ కోసం సమీప పోస్టాఫీసులలో అప్లై చేసుకునే పద్దతిని ప్రారంభించారు. దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ లేదా పోస్టాఫీసు CSS కౌంటర్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా తెలిపింది. “ఇప్పుడు మీరు సమీప పోస్టాఫీసు CSS కౌంటర్లో పాస్‌పోర్ట్ కోసం నమోదు చేసుకోవచ్చు.

ఏ పత్రాలు అవసరం…
పాస్‌పోర్ట్ పొందడానికి, మీరు జనన ధృవీకరణ పత్రం, హైస్కూల్ మార్క్ షీట్, ఎలక్షన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, నోటరీ నుంచి తయారు చేసిన అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *