Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అనే లక్ష్యం తోనే తూర్పు నియోజకవర్గంలో జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.మంగళవారం స్థానిక 5 వ డివిజిన్లో క్రైస్ట్ ద కింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని ఆయన స్పూర్తితో నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అని,ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వలన అర్హత ఉండి ఏదైనా పధకం రాకపోతే ఈ పరిష్కార వేదిక ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా డివిజన్ ని అభివృద్ధిపరచి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే 5 కోట్ల రూపాయలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి అనుమతి వచ్చిందని, ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రల నిర్మాణం కూడా చేపడుతున్నామని తెలిపారు. జగన్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజకంగా పరిపాలన సాగుతుంటే వారి రాజకీయ మనుగడ కోసం,ప్రచార ఆర్భాటాలు కోసం టీడీపీ నాయకులు షో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వారు ఒకసారి జూమ్ నుండి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వస్తే వారు ఎంత సంతోషం గా ఉన్నారో తెలుస్తోంది అని,వైసీపీ నాయకులు ప్రజలలోకి వస్తుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు అని,వారి మోములో సంతోషం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, జగన్ గారే మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండలని ప్రజలంతా కోరుకొంటున్నారు అని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళ్ళిక, మేరకనపల్లి మాధురి, వైసీపీ నాయకులు కొత్తపల్లి రజిని,బచ్చు మాదవి,చిత్రం లోకేష్, కావటి దామోదర్, ఒగ్గు విఠల్, గల్లా రవి,లామ్ కిరణ్త దితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *