ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత 2025 సంవత్సరంలో 40 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని, ఆరోగ్య వంతమైన పంటల సాగు లక్ష్యంగా అడుగులు వెయ్యాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.

స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రకృతి వ్యవసాయ రైతుల అభిప్రాయాలను పంచుకున్నారు. తొలుత ప్రకృతి వ్యవసాయం చేద్దాం అన్న ప్రతిజ్ఞ చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, మనం తీసుకునే ఆహారం ఆరోగ్యవంతంగా, ప్రయోజన కరంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా పండించే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసే బాధ్యత కూడా మనదే అన్నారు.

ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల అభిప్రాయాలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేసే క్రమంలో మూడు సంవత్సరాలు పాటు ఓపికగా ఉంటే ఎరువులు ద్వారా పండించే పంటలకు దీటుగా దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. భూమిని పరిరక్షించే బాధ్యత మనదే అని, పురుగుల మందులు, ఎరువులు వాడి భూసారాన్ని కలుషితం చెయ్యడం జరిగిందని, భూమిని పరిరక్షించే దిశగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు చేస్తుందని, భవిష్యత్తు తరాలకు మంచి ఆహారం అందించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. 2 వేల సంవత్సరంలో సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సెర్ప్ ద్వారా దేశానికి అందించిన సందర్భాన్ని కలెక్టర్ వివరించారు. ప్రకృతిని పరిరక్షించే విధంగా సాయిల్ వెస్ట్, లిక్విడ్ వెస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేసి, వాటి ద్వారా సహజ వనరులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాలుష్యం కారణంగా నిలిచే వాటిని అవసరం కోసం వినియోగించే దిశ నుంచి అలవాటుగా మార్చుకున్నామని తెలిపారు. ఎరువులు పురుగుల మందులతో కూడిన విషతుల్యమైన రసాయనాలను ఉపయోగించిన ఆహార పదార్థాలు కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి రైతు భూమిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని, దశల వారీగా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని కోరారు. లాభాపేక్షతో కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అడుగులు వేస్తున్న రైతులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామానికి చెందిన రైతు చంటి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఓపిక ఉండాలని, పురుగులు మందులు ఎరువులు ద్వారా సాగు చేసే దిగుబడి కి సమానంగా దిగుబడి సాధ్యం అవుతుందని అన్నారు.

గోపాలపురం కు చెందిన ఉండవల్లి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తగిన మద్దతు ఇవ్వాలని కోరారు.

దొమ్మేరు కి చెందిన రైతు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టిన నాటి నుంచి దిక్కు దున్నడం లేదని, ప్రకృతి పరంగా లభించిన వ్యవసాయ వ్యర్థాల ద్వారా సహజ సిద్ధ ఎరువులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఒక ఎకరాలు ఒకే దఫా మూడు పంటలు పండే అవకాశం ఉందని తెలిపారు.

ఉండ్రాజవరం కు చెందిన రైతు మురళి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎంతో సంతృప్తిని పొందుతున్నట్లు, 12 ఏళ్ల నుంచి వ్యవసాయం సాగు విధానంలో సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ బి సుజాత కుమారి, కేవీకే సమన్వయకర్త శాసవేత్త డా. యు ఎస్ గోపాల్ నాయుడు, ప్రకృతి వ్యవసాయ డిపిఎం తాతా రావు, డిఆర్ డి ఏ పిడి ఎన్ వివిఎస్ మూర్తి, ప్రకృతి వ్యవసాయ సాగు చేసే రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *