Breaking News

కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలి… : కలెక్టరు జె. నివాస్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు, వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం జిల్లాకలెక్టరు క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులతో కక్టరు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులవారీగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటులు, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు గురించి ఆరాతీసారు. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఆక్సిజన్ బెడ్స్ పెంపుచేయడం, అందుబాటులో ఉన్న బెడీకి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండవలసిన ఆక్సిజన్ సరఫరా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆంధ్రా ఆసుపత్రికి గల 4 యూనిట్లలో 100 వరకు ఆక్సిజన్ బెన్ను పెంపు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి ప్రతినిధి కలెక్టరుకు వివరించారు. జిల్లాలో కోవిడ పాజిటివ్ కేసులు స్వల్ప పెరుగుదల నమోదు అవుతున్నదని కావున ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఐసియు ఆక్సిజన్ బెడ్స్ పెంపుచేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టరు అన్నారు. 100 ఆక్సిజన్ బెడ్స్ కు 1000 యల్ పియం పరిమాణంలో, 50 – 100 ఆక్సిజన్ బెడ్స్ కు 500 యల్ పియం పరిమాణంలో ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేసుకోవాలని, బెడ్స్ సంఖ్యకు సరిమానంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టరు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) యల్. శివశంకర్ , డియం హెచ్ఓ డా.యం. సుహాసిని, డిసిహెచ్ యస్ డా. జ్యోతిర్మణి, వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *